

మునగాల మండల ప్రతినిధి ఫిబ్రవరి 11 కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని వెంకటరాంపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నీ ఎమ్మార్పీఎస్ మునగాల మండలఅధ్యక్షులు గుడిపాటి కనకయ్యమాదిగ,మరియు ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ, లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ,ఎం.ఎస్.పి.జిల్లాప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, లు పాల్గొని, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెయ్యి గొంతులు,లక్షడప్పులు సాంస్కృతిక ప్రదర్శనసభకు మందకృష్ణ మాదిగ నుండి ఏక్షణంలో నైనా పిలుపు రావచ్చు,ఈలోపు మన ఆయుధాలు అయినటువంటి డప్పు,చిర్ర,చిటికెనపుల్ల,ను తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని.బావితరాల,మన బిడ్డలకు మనము అందించే ఫలాలు దగ్గర్లోనే ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు రావలసిన న్యాయబద్ధమైన మన వాటా 11% ఇచ్చేవరకు మందకృష్ణ మాదిగ ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని తూచా తప్పకుండా పాటించి మన ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ ఆశయాలని సాధించాలని కోరారు.