Listen to this article

జనం న్యూస్:ఫిబ్రవరి 28 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా).


యర్రగొండపాలెం MLA శ్రీ తాటిపర్తి చంద్ర శేఖర్ ఆదేశాల మేరకు ఇటీవల చనిపోయిన పుల్లలచెరువు వైస్సార్సీపీ కార్యకర్త కే.వి. ప్రసాద్ పెద్దకర్మ సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబానికి అండగా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.సహాయం చేసిన వారు పుల్లల చెరువు మండల కన్వీనర్ దోమకాల వెంకశ్వర్లు 10,000 రూపాయలు, ప్రకాశం జిల్లా ysrcp ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్లకుంట జానకి రఘు 10,000 రూపాయలు చాపలమడుగు సర్పంచ్ తమ్మినేని సత్యనారాయణ రెడ్డి (సత్తి రెడ్డి) 10,000 రూపాయలు యువ నాయకుడు కంచర్ల దినేష్ 5000 రూపాయలు కలిసి మొత్తం 35,000 ఇచ్చారు. ఈ కార్యక్రమంలో,యర్రగొండపాలెం మండల కన్వీనర్ ముసలారెడ్డి ,మల్లపాలెం సర్పంచ్ ఆవుల రమణారెడ్డి మరియూ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు సవలం కోటేశ్వరరావు,MUZEB గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు,కంచర్ల ఏడుకొండలు,దినేష్, అంజి,ఆనంద రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.