జనం న్యూస్: ఫిబ్రవరి 28 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం,మార్కాపురం జిల్లా).
యర్రగొండపాలెం రెయిన్బో హైస్కూల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్ సివి రామన్ కనిపెట్టిన “రామన్ ఎఫెక్ట్ ” దీనికి గుర్తుగా ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రెయిన్బో పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులు వివిధ రకాల సైన్సు చిత్రపటాలు, ప్రాజెక్టులను రూపొందించారు. వాటిని పాఠశాలలో వాటి ప్రదర్శన ఏర్పాటు చేశారు.పాఠశాల చైర్మన్ కిరణ్ గౌడ్ విద్యార్థుల చిత్రపటాలు మరియు ప్రాజెక్టులను తిలకించి వాటిగురించి విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. సీవీ రామన్ గురించి అయన కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ గురించి విద్యార్థులకు వివరించారు. వారు చూపిన ప్రతిభను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


