Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం )

ఫిబ్రవరి నెల, 17,18,19, తేదీలలో, ఖమ్మం జిల్లాలో, (టీజీ ట్రాన్స్కో) (టీ జీ ఎస్పీ డీ సీ ఎల్)( టీ జీ ఎన్పీ డీ సీ ఎల్) విద్యుత్ శాఖ నిర్వహించిన, కల్చరల్ ప్రోగ్రాం లో, పాల్గొని రాష్ట్రస్థాయిలో, “బెస్ట్ డైలాగ్స్”( మోనో యాక్షన్) విభాగంలో, తృతీయ బహుమతిని పొందిన కామారెడ్డి జిల్లా, బీబీపేట మండలానికి చెందిన, ఎం. నాంపల్లి నిజామాబాద్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో, (దళిత సంఘర్షణ సమితి) నగర అధ్యక్షులు, ముత్తనపల్లి నాగరాజు, (కార్మిక శక్తి వారపత్రిక ఎడిటర్), రేపల్లి శ్రీనివాస్, దళిత సంఘర్షణ సమితి, కార్యదర్శి,ఎల్లం, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలాంటి మిత్రులు రాష్ట్రస్థాయి అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉందని వారన్నారు. బహుమతి గ్రహీత, నాంపల్లి మాట్లాడుతూ, నిజాంబాద్ పట్టణంలో ఇంత ఘనంగా సన్మానించడం ఎన్నటికీ మరువలేనిదని, సన్మానించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, విద్యుత్ శాఖలో నిర్వహించిన కల్చర్ ప్రోగ్రాంకు అవకాశం కల్పించిన, ఉమ్మడి నిజామాబాద్ స్పోర్ట్ అథారిటీ వారికి, కామారెడ్డి జిల్లా స్పోర్ట్ వారికి, కామారెడ్డి జిల్లా,( ఎస్ ఇ ) ( డి ఇ ) నాకు మార్గదర్శకం చూయించినటువంటి, బద్రి అనిల్, నాతో పాల్గొన్నటువంటి కళాకారులకు, ఒక ఆర్టిజన్, అనే తేడ లేకుండా, నన్ను ప్రోత్సహించిన మాచారెడ్డి ఏ ఈ. తిరుపతి రెడ్డి, సెక్షన్ అధికారులకు, ఆర్టిజన్లకు, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు.