Listen to this article

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని

తుంగూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం సభ్యులు ఆదివారం గ్రామంలోని బతుకమ్మ వాగు వద్ద చెత్త తీసేసి శ్రమదానం చేశారు. బతుకమ్మ వాగు గ్రామం నడిఒడ్డున ఉంటుందని చుట్టు పక్క ప్రజలు చెత్త వేయద్దని పలు సార్లు అవగాహణ కల్పించి చాటింపు చేసిన మార్పు రానందున తామే శ్రమదానం నిర్వహించమని సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు అన్నారు. స్వచ్చ తుంగూర్ కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు రోడ్లపై, మురుగు కాలువల్లో చెత్త వేయద్దని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శీలం లింగన్న, వార్డు సభ్యులు బండారి తిరుపతి, ఇంద్రాల తిరుపతి, దోసరాపు శ్రీనివాస్, ఉయ్యాలా రాజశేఖర్, మర్రిపెల్లి లాస్య శ్రీనివాస్, మామిడిపెల్లి అనూష రవిచంద్ర, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.