Listen to this article

జనం న్యూస్ మార్చి 1 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా

చండూరు ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రాంగణం అంతా కూడా సైన్స్ పటాలతో సప్తవర్ణాలతో నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కటి ఉపన్యాసాలు, గీతా లాపనలు, నృత్యాలు మరియు అద్భుతమైన సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించి వారి ప్రతిభను చాటడం జరిగింది. ఈ జాతీయ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డి. రమేష్ సార్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం సైన్స్ ఉపాధ్యాయులు శ్రీమతి ఫీబి మేడం గారిని మరియు శ్రీ శశిధర్ గౌడ్ గారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డి.రమేష్ సార్ గారు మాట్లాడుతూ విద్యార్థులను ప్రేరేపిస్తూ ,శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మన దైనందిన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేయడం జరిగింది. మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల తామందరం బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది .సైన్స్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి సర్ సి వి రామన్ గారు సైన్స్ రంగానికి చేసిన కృషిని తెలియజేస్తూ ,శాస్త్ర ఆవిష్కరణ పట్ల విద్యార్థులను చైతన్య పరచడం జరిగింది మరియు చివరగా ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించినటువంటి వివిధ కాంపిటీషన్ లలో బహుమతులను ప్రధానం చేయడం జరిగింది.
డ్రాయింగ్ లో ప్రథమ బహుమతి ఎండి ఫాజిల్ 10వ తరగతి ద్వితీయ బహుమతి కె లావణ్య 10వ తరగతి
తృతీయ బహుమతి శరణ్య 6వ తరగతి సాధించడం జరిగింది. ఎగ్జిబిట్స్ లో ప్రథమ బహుమతి బట్టు అరుణ్ కుమార్ 7వ తరగతి ద్వితీయ బహుమతి పి రోహిత్ 8 వ తరగతి తృతీయ బహుమతి జె జీవన్ కుమార్ 9వతరగతి గెలుపొందడం జరిగింది.