Listen to this article

నిందితుడి రిమాండ్ జైలుకు తరలింపు

బిచ్కుంద మార్చ్ 01 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని బిచ్కుంద గ్రామంలో భూ తగాదా నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు అత్యంత వేగవంతంగా స్పందించి 24 గంటల్లోనే ఛేదించారు.
మృతుడు మెరుగు సాయిలు (తండ్రి: సాయన్న), నివాసం: బిచ్కుంద గ్రామం. భూ వివాదాల కారణంగా అతని సొంత సోదరుడు మెరుగు నారాయణ కర్రతో తలపై దాడి చేయగా, తీవ్ర గాయాల కారణంగా మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో క కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం సెక్షన్ 103(1) కింద దర్యాప్తు ప్రారంభించబడింది.
గౌరవ బాన్సువాడ డిఎస్పీ శ్రీ విట్టల్ రెడ్డి గారి పర్యవేక్షణలో, సీఐ బిచ్కుంద శ్రీ రవి గారు, ఎస్‌ఐ శ్రీ గుండెల రాజు గారు (SHO), ఎస్‌ఐ శ్రీ అరుణ్ గారు (పెద్ద కొడపగల్) మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడింది. సాంకేతిక ఆధారాలు మరియు సాక్ష్యాలను సమగ్రంగా సేకరించి, నిందితుడిని 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది.దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద నుండి రక్తపు మరకలతో ఉన్న షర్ట్ మరియు దాడికి ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించి సీజ్ చేయబడినవి.అరెస్టు చేసిన నిందితుడిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్‌ చేసి జైలుకి తరలించడం జరిగింది.