జనం న్యూస్ మార్చి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కృతజ్ఞత సభకు మండలం లోని తెలంగాణఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు గద్దె మారిసురేష్ శాయంపేట టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ కు తరలి వెళ్లారు అనంతరం మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన మాట అమలుపరచాలని ఆయన అన్నారు తెలంగాణ ఉద్యమకారుల పట్ల హైకోర్టు తీర్పు హర్షించదగిన విషయం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అతి తొందరగా ఉద్యమకారులను గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల యూత్ అధ్యక్షుడు ముంజలనాగరాజు ఉద్యమ ఉద్యమకారుల మండల నాయకులు ఉప్పురాజు దుంపల మహేందర్ రెడ్డి మదర్ సాబ్ ఆడ ప్రభాకర్ కోలనందం మండలం నుండి 25 మంది ఉద్యమకారులు కరీంనగర్ సభలో పాల్గొన్నారు….


