జనం న్యూస్ మార్చి 2 రిపోర్టర్ (ఓడిటి రాజేందర్ )
ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు 89వ జయంతి సందర్భంగా మహా ముత్తారం మండల కేంద్రంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో, శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం కేక్ కటింగ్ చేసిన మహా ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు….
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.
శ్రీ పాద రావు గారు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, శాసనసభ గౌరవాన్ని కాపాడిన ఆదర్శ నాయకుడిగా గుర్తింపు పొందారు. మంథని నియోజక వర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అంకితభావంతో సేవలు అందించారు, అనంతరం శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి సభా పరిపాలనలో నిష్పక్ష పాత్ర ధోరణి ప్రదర్శించారు.నాయకులు తమ ప్రసంగాల్లో ఆయన సరళ జీవన శైలి, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అనురాగం, గురించి ప్రస్తావిస్తారు యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషి, చిరస్మరణీయమని కొనియాడారు.దుద్దిల్ల శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా ఆయన ఆశలు సిద్ధాంతాలు స్ఫూర్తిగా నిలిచి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు.దేశం గర్వించేదగ్గ గొప్ప నాయకుడు మన ప్రాంత వాసి కావడం మనందరికీ గర్వకారణం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గంట్ల దేవేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొండ గొర్ల బాపు, EX, ZPTC లింగమళ్ల శారద దుర్గయ్య, కాలేశ్వర దేవస్థానం డైరెక్టర్ ముక్కెర రాజమల్లుగౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశీరాజ్, గ్రామ శాఖ అధ్యక్షుడు లింగమల్ల రాజయ్య, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గడ్డం రాజాబాబు, ప్రచార కమిటీ కార్యదర్శి చకినాల రాజు, మాజీ కో ఆప్షన్ నెంబర్ నజీర్ ఖాన్, మహా ముత్తారం యూత్ టౌన్ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్ గౌడ్, మహా ముత్తారం మాజీ ఉపసర్పంచ్ వేముల మధుకర్ గౌడ్, కనుకునూరు మాజీ ఎంపీటీసీ తోలం వెంకటేశ్వర్లు,మండల కాంగ్రెస్ కార్యదర్శి మోత్కూరు రవి, మండల ప్రధాన కార్యదర్శి,మల్లయ్య,మండల్ ఉపాధ్యక్షురాలు బౌతు రమ్య,మల్లయ్య, సర్పంచులు అట్టెం రమేష్, జాటోత్ రాజు నాయక్, సగులం అనసూయ నరసింహ, చీపురు రాజు మల్లయ్య, పులుసే సుమలత రాజు, సింగారం మాజీ సర్పంచ్ మొక్క నరసయ్య,మీనాజీ పేట మాజీ సర్పంచ్ ఓలపు శంకరయ్య,మహా ముత్తారం ఉపసర్పంచ్ రాoనేని పూజిత కృష్ణంరాజు, గ్రామ యూత్ అధ్యక్షుడు మాడం ప్రసాద్,వార్డు మెంబర్లు, నితిన్, రాజయ్య, లావణ్య సుమన్, తిరుమల ధర్మయ్య, రాజేందర్, పోలరం వార్డ్ మెంబర్లు, ఏనుగు మౌనిక రాజేందర్, వేల్పుల రాజేశ్వరి సంతోష్,పెగడపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రామగిరి రాజయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాటి లచ్చయ్య గౌడ్, మార్క బాబు, నూకల రవి, జాడిబాబు, కొండ రామచంద్రం, ముక్కర చంద్రయ్య, చిటూరి అశోక్, లింగ మళ్ళ మల్లేష్, లింగమల రాజు, శ్రీపతి శ్రీనివాస్, గంధం లచ్చయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు, కలవచర్ల రజాకర్,గాదె రవీందర్, జోడ విజేందర్, జాడి సతీష్, మంతెన వెంకటేష్, వావిల్లా రవి,మరియు మారుపాక రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


