జనం న్యూస్,2 మార్చ్ సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1928 ఫిబ్రవరి 28న సర్ సి.వి. రామన్ కనుగొన్న “రామన్ ఎఫెక్ట్”కు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా ప్రకటించింది. 1986 సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు విజ్ఞాన ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ, భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలను వివరించారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మల్లికా మేడం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


