జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని మాందారి పేట గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఎక్స్పైర్ అయిన కోడిగుడ్లను గర్భిణీలకు బాలింతలకు ఇచ్చి ఇబ్బందుల గురి చేస్తున్న అంగన్వాడి టీచర్ కొమ్ముల స్వరూప ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్న గర్భిణీలు బాలింతలు మాందారి పేట గ్రామానికి చెందిన కొమ్ముల సౌజన్య అంగన్వాడి సెంటర్ లో పేరు నమోదు చేసుకొని గుడ్లు పాలు బాలామృతం లాంటివి తెలంగాణ ప్రభుత్వం నుండి అంగన్వాడీ కేంద్రంలోని కొమ్ముల స్వరూప కు అందించేవారు ఇదే క్రమంలో ఒకసారి పాడైన గుడ్లు తినగా మా పాప మూడు నెలలుగా ఉన్నప్పుడు జ్వరం తో జాండీస్ వస్తే ఆస్పత్రిలో వైద్యం చేయించాము ఇప్పుడు మా పాప 12 నెలల వయసు ఉంది ఇప్పుడు కూడా గుడ్లపై డేట్ చూడగా జనవరి అని ఉంది ఇవి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని అడగగా ఇవి నిన్ననే వచ్చాయి అని నిర్లక్ష్యపు సమాధానం చెబుతుంది తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు అని మాట్లాడుతుంది తెలిపారు అంగన్వాడి టీచర్ స్వరూప పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నాణ్యమైన పోషక పదార్థాలు అందించాలని సూచించారు….


