జనం న్యూస్ మార్చి 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన నీటి సౌధం…. ఒకప్పుడు గ్రామానికి తాగునీరు అందించి వ్యవసాయానికి…పాడిపంటలకు జీవాధారమైన నల్ల చెరువు గడిచిన దశాబ్ద కాలంలో పూర్తిగా మురికి నీరు డ్రైనేజ్ నీరు బురద ఇంకా చెత్తతో నిండిపోయింది.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అలాగే మరుగున పడిన నీటి వనరులను శుద్ది చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా కూకట్పల్లి నల్ల చెరువును హైడ్రా ఆధ్వర్యంలో పూర్తిగా శుద్ది చేసి ఆ చెరువుకు పూర్వ వైభవం తెచ్చి చెరువు చుట్టూ పార్కు ఇంకా వాకింగ్ ట్రాక్ నిర్మాణాల ఏర్పాటు చేసిన సందర్భంగా కూకట్పల్లి గ్రామ ప్రజలతో నల్ల చెరువుకు వ్యాయామం మరియు వాకింగ్ కోసం వచ్చిన స్థానిక ప్రజలతో మాట్లాడిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఈ సందర్భంగా స్థానికులు ఆయనతో వారి అనుభవాలను పంచుకుంటూ రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లేని విధంగా అద్భుతమైన పాలనా సంస్కరణలు తెచ్చి ప్రజలకు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని….. నల్ల చెరువును ఇంత సుందరంగా అద్భుతంగా ఊహించని విధంగా బాగు చేస్తారని అనుకోలేదు అంటూ వారు ప్రభుత్వానికి బండి రమేష్ కి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ మేలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అద్యక్షులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ , డివిజన్ అధ్యక్షులు ,బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, యన్ యస్ యుఐ నాయకులు, మైనారిటీ నాయకులు, యస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు ,సేవ్ దళ్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



