బిచ్కుంద మార్చ్ 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని మంగళవారం నాడు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో హోలీ రంగుల పండుగ ఘనంగా నిర్వహించారు. హోలీ రంగుల పండుగ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ బిచ్కుంద పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగు ఆనందాలు విజయాలు నింపాలని ఆకాంక్షించారు ఈ హోలీ పండుగ మీ కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమ అనురాగాలను మరింత బలపరచాలని ప్రతి ఇంట్లో నవ్వులు నిండాలని మనస్ఫూర్తిగా కోరినారు .ఇట్టి కార్యక్రమంలో రాజు సెట్. ఉత్తం సాహిల్ సెట్కార్ . ధర్పల్లి సంతోష్ బండు పటేల్. బస్వంత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




