

మన్యం బంద్ ను జయప్రదం చేయండి
స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలి – బుట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ చాంబర్ అధ్యక్షులు బన్నె బుచ్చిరాజు
అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి – ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యుడు కారం రాఘవ
ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య సమావేశంలో డిమాండ్
జనం న్యూస్/ఫిబ్రవరి12/బుట్టాయిగూడెం/రిపోర్టర్ :సోమరాజు నడపాల:- 1/7౦ చట్టం పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవగాహన రాహిత్య వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12న రాష్ట్రవ్యాప్త మన్యం బందు ను విజయవంతం చెయ్యండని ఆదివాసి ఐక్యకార్యచరణ కమిటి ఏలూరు జిల్లా చైర్మన్ మొడియం శ్రీనివాసరావు అన్నారు. ఈ స్థానిక మీడియాతో మాట్లాడుతూ టూరిజ పారిశ్రామికవేత్తల సమావేశంలో షెడ్యూల్ ప్రాంతంలో ఎస్టీలు కొట్లలో పెట్టుబడులు పెట్టలేరని ఎస్టీలను కించపరుస్తూ, 1/70 భూ బాదలయింపు నిషేధ చట్టన్ని సవరణ చేయడానికి ఉన్నా అవకాశాలను అధ్యయనం చేయాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కలెక్టర్లకు సూచించడాన్ని నిరసిస్తూ ఈనెల 12 వ తారీఖున రాష్ట్రవ్యాప్త మన్యం బంద్ కు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా ఏలూరు జిల్లా, సింగనపల్లి కమ్యూనిటీ హాల్ నందు ఆదివాసి ముఖ్య నాయకుల సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రవ్వ బసవరాజు మాట్లాడుతూ ఏజెన్సీలో ఎస్టీలు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టలేరని, 1/ 70 చట్టం సవరణకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని కలెక్టర్లకు సూచిస్తూ ఆదివాసీల పట్ల అవహేళనగా మాట్లాడిన స్పీకర్ అయ్యన్న ఆదివాసులకు క్షమాపణ చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఐ.ఎఫ్.టి.యు ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు సరియం రామ్మోహన్ రావు మాట్లాడుతూ నాన్ ట్రైబుల్స్ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు,ఆదివాసీలు పెట్టుబడులు పెట్టలేరని ఆదివాసులను కించపరుస్తూ చులకనగా మాట్లాడిన అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని ఐ.ఎఫ్.టి.యు ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు సరియం రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్, ఏలూరు జిల్లా ఆదివాసి ఐక్యకార్యచరణ కమిటి చైర్మన్ మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ, 1/70 చట్టం అసెంబ్లీ పరిధిలోది కాదని, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పేరా 5 (2) ప్రకారం TAC తో కూడిన గవర్నర్ గారి ద్వారా చట్టం చేయబడిందని,అసెంబ్లీ ఏర్పడి సుమారు 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగాన్ని అవమానపరచుటమేనని, ఎంతో బాధ్యతయుతమైన స్పీకర్ పదవిలో ఉండి ఆదివాసి చట్టాలపై తనకు అవగాహన లేదని చెప్పడం సిగ్గుచేటని, ఆదివాసి చట్టాలపై గౌరవం లేని వ్యక్తి స్పీకర్ గా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమని వేలకోట్లు టిఎస్పి నిధులు దారి మళ్ళించి ఎస్టీలను పేదలను చేసింది మీరు కాదా? అయన అని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో నాయకులు పలు డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. షెడ్యూల్ ప్రాంత చట్టాలపై అవగాహన లేని స్పీకర్ అయ్యన్న ఆదివాసీలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్య లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని,ఏజెన్సీ ప్రాంతం ముఖ ద్వారాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ వలసలు అరికట్టాలని, అక్రమ చొరబాటుదారులకు చట్టవిరుద్ధంగా మంజూరు చేసిన అన్ని రకాల గుర్తింపు కార్డులను రద్దు చేయాలని,ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ను వెంటనే ప్రకటించి,అసెంబ్లీ భవనం పక్కనే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు రాజ్యాంగంపై ముఖ్యంగా ఐదో షెడ్యూల్ పై శిక్షణ ఇప్పించాలని,రాజ్యాంగ ఉత్తర్వులు ద్వారా ప్రకటించిన మొత్తం షెడ్యుల్ ప్రాంతాన్ని రెండు మూడు ప్రత్యెక ఆదివాసి జిల్లాలుగా ప్రకటించాలని,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టిలకు కేటాయించిన నిధులను దారి మల్లించకుండా ఎస్టిలకే ఖర్చు చెయ్యాలని,ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు అయ్యన్నపాత్రుని వ్యాఖ్యలను ఖండించాలని అన్నారు.ప్రతి ఐటీడీఏకు 500 కోట్ల నిధులు కేటాయించి షెడ్యూల్ ప్రాంతంలో టూరిజన్ని అభివృద్ధి చేసి ఆదివాసీలకు అప్పగించాలి.
ఈ సమావేశంలో అచ్చయ్యపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ కుంజ వెంకటేశ్వరరావు, కోయ రాజమండ్రి పంచాయతీ ప్రెసిడెంట్ రవ్వ నాగు, కే.ర్.పురం పంచాయతీ ప్రెసిడెంట్ ఉకె బొజ్జి,ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ కార్యదర్శి తెల్లం లక్ష్మణరావు, ఆదివాసి సంపరిషత్ బుట్టాయిగూడెం మండల కార్యదర్శి పోడియం కొవ్వాడయ్య , ప్రధాన కార్యదర్శి , బుట్టాయిగూడెం మండల అధ్యక్షుడు రవ్వా బసవరాజు, ఉపాధ్యక్షుడు పోడియం కొవ్వాడయ్య, ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ సోదెం ముక్కయ్య , తెల్లం రాజు, పోడియం వెంకన్న బాబు మొదలగు వారు పాల్గొన్నారు.