Listen to this article

బిచ్కుంద మార్చ్ 3 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని మంగళవారం నాడు బిచ్కుంద మున్సిపాలిటీ చైర్మన్ సీమా రమేష్ సెట్ ఆధ్వర్యంలో హోలీ రంగుల పండుగ ఘనంగా నిర్వహించారు. హోలీ రంగుల పండుగ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ బిచ్కుంద పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగు ఆనందాలు విజయాలు నింపాలని ఆకాంక్షించారు ఈ హోలీ పండుగ మీ కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమ అనురాగాలను మరింత బలపరచాలని ప్రతి ఇంట్లో నవ్వులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .ఇట్టి కార్యక్రమంలో మహిళ లు పిల్లలతో కలిసి హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు