బిజెపి నాయకుడు పాలింకర్ సంతోష్
జహీరాబాద్, మార్చ్ 03(జనం న్యూస్)
హిందూ పండుగలో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగ హోలీ. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండగ స్నేహానికి సమా నత్వానికి ప్రతీక. ఈ ఏడాది మార్చి 4వ తేదీన జరుపుకోనున్న ఈ హోలీ కేవలం రంగుల ఆట మాత్రమే కాదు. దీని వెనక గొప్ప పురాణ చరిత్ర సామాజిక ప్రాముఖ్యత వసంత కాలపు ఆహ్వానం దాగి ఉన్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుకను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. హోలీ చరిత్ర విశిష్టత : హిందూ క్యాలెండర్ ప్రకారం.. పాల్గొన మాసంలోని పౌర్ణమ రోజున హోలీ పండుగలు జరుపుకుంటారు. చలి కాలం ముగిసిన, వేసవి కాలం ప్రారంభమయ్యే వసంత కాలంలో ప్రకృతి కొత్త చేగులతో కళకళలాడు తున్నప్పుడు ఈ రంగుల పండుగ వస్తుంది. హోలీ జరుపుకోవడానికి ప్రధాన కారణం భక్త ప్రహ్లాదుని కథ. హిరణ్య కాశివుడు అని రాక్షస రాజు తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు మూర్తిని పూజించడం సహించలేక పోతాడు. ప్రహలదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫల మైన తర్వాత.. తన సోదరి హోలీక * సహాయం కోరుతాడు. హోలికకు అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. కానీ.. విష్ణు మాయ వల్ల దైవచింతనంలో ఉన్న ప్రహల్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. రాక్షస గుణo ఉన్న హోలీ మంటల్లో కాలిపోతుంది. ఈ విధంగా చెడుపై మంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ * హోళిక దహనం చేస్తారు. దీనికి మనం కాముని పున్నమ్ అని అంటాము అని బిజెపి నాయకుడు పాలెం కార్ సంతోష్ అన్నారు.


