జనం న్యూస్ 04 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గురుకుల విద్యార్థి గల్లంతులో నిర్లక్ష్యం ఎవరిది.!చెరువులో పడిన విద్యార్థి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు.!రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే సంక్షేమ బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుకుంటున్న రాజు అనే విద్యార్థి ఫరూక్ నగర్ మండలం రాయికల్ శివారులో ఉన్న చెరువులోకి ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు షాద్ నగర్ పరిధిలోని నేషనల్ హైవే పక్కనే ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ సంక్షేమ గురుకుల వసతి గృహంలో తన చదువును కొనసాగిస్తున్నాడు మంగళవారం నాడు హోలీ సందర్భంగా సెలవు ఉండడంతో నలుగురు విద్యార్థులతో కలిసి చెరువులోకి ఈత కొట్టడానికి వెళ్లిన రాజు ఇప్పటి వరకూ తిరిగి బయటకు రాలేదు దీంతో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు నిర్లక్ష్యం ఎవరిదో కానీ డిగ్రీ చదువుతున్న విద్యార్థి చెరువులో గల్లంతు కావడంతో విద్యార్థి తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి..


