జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
ఆడ తోడు కోసం వెతుకుతున్న మగ పెద్ద పులి మహా రాష్ట్ర లోని తడోబా అడవుల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన మగ పెద్ద పులి అప్రమత్తమైన అటవీ అధికారులు.జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో సంచరించిన పెద్దపులి తాజాగా కమ్మర్ పల్లి అటవీ రేంజ్ లోకి వచ్చినట్లు అటవీ శాఖ పెద్దపులి ఆనవాళ్లు గుర్తించారు కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ కోనాపూర్ అడవుల్లో పెద్దపులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు అది ఎటువైపు వెళ్ళిందో అని విషయమై కచ్చితంగా అంచనాలకు రాలేదు.సిరికొండ, ఇందల్వాయి అటవీ రేంజ్ లోకి పులి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ భావిస్తుంది.కోనాపూర్, మానాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది కాబట్టి పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.


