జనం న్యూస్ 04 మార్చి వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లి సామేల్ ఆధ్వర్యంలో హోలీ రంగుల పండుగ ఘనంగా నిర్వహించారు. హోలీ రంగుల పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సామేల్ మాట్లాడుతూ.. గట్టుపల్లి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగు ఆనందాలు విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ హోలీ పండుగ మీ కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమ అనురాగాలను మరింత బలపరచాలని, ప్రతి ఇంట్లో నవ్వులు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, పెద్దలు, మహిళలు నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


