Listen to this article

జనం న్యూస్ 04 మార్చి వికారాబాద్ డిస్టిక్ ఇంచార్జ్ కావలి నర్సిములు

వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో హోలీ పండుగను సర్పంచి పద్మ-రాజు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఉత్సాహంగా – ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లి స్నేహభావాన్ని పంచుకున్నారు. గ్రామ వీధులు రంగుల హరివిల్లులా మారి పండుగ శోభను సంతరించుకున్నాయి. హిందూ పండుగలో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగ హోలీ. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండగ స్నేహానికి సమానత్వానికి ప్రతీక,
ఈ సందర్భంగా అందరూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. సాంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకున్నారు. హోలీ పండుగ గ్రామంలో ఐక్యత, స్నేహభావం, సౌహార్దతకు ప్రతీకగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, పెద్దలు, మహిళలు నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.