జనం న్యూస్ 04 మార్చ్
హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలతో హోలీ ఆడిన అనిల్ కుమార్ యాదవ్
పురాణాల హితిహాసంలో హోలిక అనే రాక్షసి పై చెడుపై మంచి విజయానికి ప్రతీక జరుపుకునే ఈ పండుగను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి బల్దియా కార్మికులతో హోళీ సంబరాలు జరుపుకొన్నారు. సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్నా వారిని హక్కును చేర్చుకుని వారికి తోడుగా నిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.



