జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 4 సెల్ 9550978955
మాచర్ల మున్సిపాలిటీ మేనేజర్‌గా మరియు రెవెన్యూ ఆఫీసర్‌గా (అదనపు బాధ్యతలు) బాధ్యతలు చేపట్టిన శాగాంటి బెయిలీ బాబు కి ప్రకాష్ నగర్ మరియు తాళ్లూరి నగర్ క్రిస్టియన్ యూత్ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇటీవల నరసరావుపేట మున్సిపల్ ఆర్.ఐ (RI)గా సమర్థవంతంగా విధులు నిర్వహించిన బెయిలీ బాబు పదోన్నతిపై రెవెన్యూ ఆఫీసర్‌గా జనవరి లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నందికొట్కూరు మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్‌గా విశేష సేవలు అందించిన ఆయన, ప్రస్తుతం డిప్యూటేషన్‌పై మాచర్ల మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా క్రిస్టియన్ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ అత్యంత సమర్థవంతమైన అధికారిగా పేరున్న బెయిలీ బాబు నాయకత్వంలో మాచర్ల పట్టణం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మున్సిపల్ మరియు రెవెన్యూ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, పట్టణ ప్రగతికి ఆయన విశేష కృషి చేస్తారని వారు ఆకాంక్షించారు. ఈ అభినందన కార్యక్రమంలో ప్రకాష్ నగర్ మరియు తల్లూరి నగర్ క్రిస్టియన్ యూత్ ప్రతినిధులు, సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.


