Listen to this article

జుక్కల్ మార్చ్ 4 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణ పూర్తి చేసిన లబ్ధిదారునికి జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ లబ్ధిదారునికి బుధవారం నాడు శాలువాతో సన్మానించి సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ గృహ పథకంలో నిర్మాణం పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు సన్మానించిన లబ్ధిదారునికి బిల్లు మంజూరు కొరకు పంపించడం జరిగిందని త్వరలో బిల్లు లబ్ధిదారుని ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జుక్కల్ గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ రాజు గ్రామపంచాయతీ సిబ్బంది యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు