Listen to this article

జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని మాందారి పేట గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఎక్స్పైర్ అయిన గుడ్లు ఇవ్వగా పత్రిక ద్వారా నేను న్యాయం కావాలని కోరగా ఇంచార్జ్ సిడిపిఓ ఉమా సూపర్వైజర్ పుణ్యవతి వచ్చి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం అన్నారు ఇప్పటికే ఇలా చాలాసార్లు జరిగింది అని కొమ్ముల సౌజన్య తెలిపారు ఇది మూడో నాల్గవసారి ఎక్స్పైర్ అయిన గుడ్లు ఏ విధంగా పంపిణీ చేశారు నిర్లక్ష్యం ఎవరిది కొన్ని గుడ్లపై డేట్ చెరిపేసి ఉంటుంది అని ఆమె అడిగా వారి నుండి ఏ విధమైన స్పందన రాలేదు అక్కడ ఎవరూ లేకున్నా కూడా కొంతమందితో విచారణ చేసినట్టు హడావిడిగా రాసుకొని పోయారని తెలియజేశారు అంగన్వాడి టీచర్ నుండి కాంట్రాక్టర్ దాకా కలెక్టర్ విచారణ చేపట్టాలని మిగతా లబ్ధిదారులు కలిసి కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తాం అని జిల్లా కలెక్టర్ ఇంకా పై ఉన్నతాధికారులతో విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని కొమ్ముల సౌజన్య పేర్కొన్నారు..