బిజెపి నాయకుడు పాలింకర్ సంతోష్
జహీరాబాద్, మార్చ్ 04(జనం న్యూస్)
నియోజకవర్గ పట్టణ పరిధిలోని 24వ వార్డులో బుధవారం బిజెపి నాయకుడు పాలెం కార్ సంతోష్ ఆధ్వర్యంలో హామాలి కాలనీలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. హోలీ పర్వదిన సందర్భంగా పట్టణంలో పలువురు ప్రముఖులను కలుస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ వేడుకల్లో హిందూ ముస్లిం మధ్య స్నేహభావాన్ని పెంచేందుకు ముస్లిం సోదరులతో కలిసి హోలీ ఆడాను. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఉత్సాహం వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆత్మీయ మిత్రులతో హోలీ పండుగ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్నేహభావం ఐక్యత మరింత బలపరిచేలా ఈ వేడుకలు నిర్వహించా మని పాలింకర్ సంతోష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా కాలనీవాసులు స్నేహితులు కలిసి వేడుకలు నిర్వహించారు.


