జనం న్యూస్ మార్చి 04: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలం:అక్రమ ఇసుక రవాణాను నిరోధించుటలో భాగంగా బుధవారం రోజునా తడపాకల్ గ్రామ పరిధిలో విస్తృతంగా గస్తీ నిర్వహించామని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల ప్రాంతంలో ఒక ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను గుర్తించామని, అలాగే ట్రాక్టర్ పక్కన నిల్వ ఉంచిన సుమారు 15 ట్రాక్టర్ ట్రిప్పుల మేర అక్రమ ఇసుకను సీజ్ చేసినట్లు చెప్పారు.అదేవిధంగా తడపాకల్ గ్రామములోని గోదాం వద్ద మరో 16 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక డంపును గుర్తించి సీజ్ చేయడం జరిగిందన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేయడం మరియు నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమని, ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.మండల పరిధిలో ఎవరైనా అక్రమంగా ఇసుక మొరము రవాణా చేసినట్లయితే వాహనాలను సీజ్ చేసి, వాహన డ్రైవర్లు మరియు యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మల్లయ్య హెచ్చరించారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి అక్రమ ఇసుక రవాణాకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.



