జనం న్యూస్, మార్చి 04,అచ్యుతాపురం:
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు తమను తాము రక్షించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఈరోజు అచ్యుతాపురం కస్తూరిబా పాఠశాలలో విద్యార్థునిలకు సెల్ఫ్ డిఫెన్స్ అనగా ఆత్మరక్షణ క్లాసులను శిక్షణ పొందిన మార్షల్ ఆర్ట్స్ మహిళా నిపుణులతో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందడమే కాకుండా మానసిక ఉల్లాసం, చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై పోషణ, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.



