

జనం న్యూస్ 11 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్జనసేన పార్టీ భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేత గురాన అయ్యలు స్పష్టం చేశారు విజయనగరం నియోజకవర్గంలో కోరుకొండ గ్రామం నుండి సిరిపురపు దేముడు, నాగులపల్లి ప్రసాద్ నేతృత్వంలో 30 కుటుంబాలకు చెందిన వాళ్ళు జనసేన నేత గురాన అయ్యలు ఆధ్వర్యంలో సోమవారం వైకాపా నుండి జనసేన పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో అసలుసిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.జన సైనికులకు భద్రత, భరోసా జనసేన లక్ష్యమన్నారు.కల్మషం లేకుండా పార్టీ కోసం పనిచేస్తూ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జనసైనికులంతా బలంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుండి రాష్ట్రస్థాయి నాయకుల వరకూ అందరితో మమేకమై పార్టీ ని బలోపేతం చేయడానికి సమిష్టిగా పని చేద్దామన్నారు.పార్టీకి, ప్రజా ప్రయోజనాలకు సంభందించిన ఏ అంశాలైనా చర్చించడానికి జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత, నిజాయితీ, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదన్నారు.ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఆదాడ మోహన్ రావు, చిన్నికిషోర్ , ఎంటి రాజేష్ , పాండ్రంకి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు