Listen to this article

జనం న్యూస్ 05 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

విద్యార్థులకు ప్రేరణనిచ్చిన ఐజ మున్సిపల్ చైర్మన్.సీఎం సురేష్ ఐజ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్ హై స్కూల్)లో “తక్కువ భయం –ఎక్కువ ఏకాగ్రత మెరుగైన ఫలితాలు” అనే అంశంపై విద్యార్థులకు ప్రేరణాత్మక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గౌరవ ప్రధానోపాధ్యాయులు రాములు మరియు ఎంఈఓ వారి ఆహ్వానం మేరకు ఐజ మున్సిపాలిటీ గౌరవ చైర్మన్ సీఎం సురేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు..ఈ కార్యక్రమం ప్రారంభంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల నిర్వహణ బృందం కలిసి గౌరవ మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ శాలువా కప్పి ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. తమ పాఠశాలలో చదివిన ఒక విద్యార్థి ఈరోజు ఐజ పట్టణానికి ప్రథమ పౌరుడిగా ఎదగడం తమకు ఎంతో గర్వకారణమని వారు తెలిపారు…ఈ సందర్భంగా సీఎం సురేష్ మాట్లాడుతూ, తాను ఇదే బాయ్స్ హై స్కూల్‌లో ఒక సాధారణ విద్యార్థిగా చదివానని, అదే పాఠశాలకు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇది తన జన్మ సుకృతమని పేర్కొన్నారు. తన విద్యాభ్యాస కాలంలో తనకు మార్గనిర్దేశం చేసిన గురువులను స్మరించుకుంటూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం, పాఠశాలలో చదువులో మరియు ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన కొంతమంది విద్యార్థులను మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందిస్తూ, ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలను చేరాలని ప్రోత్సహించారు.విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ ఆయన మాట్లాడుతూ, పరీక్షల సమయంలో భయం లేకుండా ఒక మంచి ప్రణాళికతో చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలమని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు విద్యే జీవితాన్ని మార్చే గొప్ప అవకాశమని చెప్పారు.ప్రస్తుతం చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీవో, పోలీస్ అధికారులు వంటి ఉన్నత పదవులను సాధించాలని ఆకాంక్షించారు. అలాగే సమాజానికి సేవ చేసే గొప్ప వ్యాపారవేత్తలుగా, నాయకులుగా ఎదగాలని సూచించారు.కార్యక్రమం చివరలో మాట్లాడుతూ, తన పూర్వ పాఠశాలకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయం ప్రభుత్వ స్థాయిలో గానీ, వ్యక్తిగతంగా గానీ పూర్తిస్థాయిలో అండగా ఉంటామని తెలిపారు..ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ అడిగా కూడా పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. అలాగే జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మరియు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భయాన్ని తగ్గించి, ఏకాగ్రతను పెంచి, క్రమశిక్షణతో కష్టపడితే ప్రతి విద్యార్థి తన భవిష్యత్తును విజయవంతంగా నిర్మించుకోగలడు. విద్యే మన జీవితాన్ని మార్చే మహత్తర శక్తి.