జనం న్యూస్ మార్చి 5, వికారాబాద్ జిల్లా,
దేశవ్యాప్తంగా శ్రామిక మహిళ ల ఉపాధిపై దాడులు విచ్చల విడిగా పెరిగిపోయావని ,రమహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయినాయి,హంతకులను,నేరస్తులను పూలదండలేసి ఊరేగింపులు చేస్తున్నారని శ్రామిక మహిళల ఉపాధిపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా శ్రామిక మహిళలు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.గీత పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద ప్రగతిల మహిళా సంఘం పిఓడబ్ల్యూ మార్చి 8 పిలుపు పోస్టర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా వై గీత మాట్లాడుతూ 1975లో ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట దినోత్సవం నిర్వహిస్తున్నారని 51 సం.లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు కుంటున్నా మహిళల కు ఎంత మాత్రం రక్షణ లేదని, బ్రాహ్మణీయ,పురుషాధిక్య సమాజoవైపు సతీసహగమనం వైపు మనుధర్మ శాస్త్రం, మతోన్మాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బిజెపి దాని అనుబంధం సంస్థలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.నేడు ఉపాధి హామీపథకాన్ని విబిజి రాంజీ పథకంగా మార్చారని,వికసిత భారత్, గ్యారెంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ గ్రామీణ, అమృత్ భారత్,ఉద్యోగ భారత్,బేటి బచావో బేటి పడావో,మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా,అచ్చే దిన్,స్వావలంబన అంటూ ఆత్మ నిబ్బర్ పేరుతో దేశాన్ని, సంస్థలను,వ్యవసాయ రంగాన్ని,అడవులను,ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడమే కర్తవ్యంగా మోడి ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు.స్త్రీ పురుష సమానత్వం కై శ్రామిక మహిళల ఉపాధి పై జరిగే దాడికి వ్యతిరేకంగా మహిళల హక్కుల సాధనకు 501 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కమిటీ పిలుపునిచ్చిందని అందువల్ల 51 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవ సభలను నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు అర్ణిల, గాయత్రి ,సునీత,మమత, సునిత, లక్ష్మీ,సత్యమ్మ,అంజమ్మ, మున్నీ తదితరులు పాల్గొన్నారు.


