Listen to this article

జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో గ్రామంలో వార్డులలో (సందర్శన ) తిరుగుతూ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న శిధిలావస్థలో ఉన్న ఇండ్లు మరమ్మత్తులు చేసుకోవాలని లేనియెడల వాటి ని తొలగించి శుభ్రంగా చేసుకోవాలని ప్రమాదకరంగా ఉన్న పాత బావిలు వెంటనే పూడ్చుకోవాలని వాటి యజమానులకు తెలియజేస్తూ నోటీసులు ఇస్తూ మునుముందు వర్షాకాలంలో నీరు నిలవకుండా కాళీ ప్లాట్లలో శుభ్రం చేసి బరంతులు( మట్టి) పోసుకోవాలని నోటీసులు ఇస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదని వారికి సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ్రామ శోభన్ వార్డు సభ్యులు కనగందుల మురళి,ఎరుకల భదంపురం నరసయ్య, అల్లిపురం శంకర్, గ్రామ కార్యదర్శి,కారోబార్, తదితరులు పాల్గొన్నారు.