Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 11 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసు స్టేషన్లో నవంబరు 2024లో నమోదైన పోక్సో కేసులోనిందితుడు పూసపాటిరేగ మండలం పెద పతివాడ గ్రామానికి చెందిన మైనపు హరీష్ (19 సం.లు) కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 7సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.3,000/- లు జరిమానా విధిస్తూజనవరి 10న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనవరి 10న తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పెద పతివాడ గ్రామానికి చెందిన మైనపుహరీష్ (19 సం.లు) అదే గ్రామానికి చెందిన 5సం. ల మైనరు బాలికపై 2024 నవంబరు 11న లైంగిక దాడికి పాల్పడినట్లుగా మైనరు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి,దర్యాప్తు చేపట్టారన్నారు. ఈ కేసులో నిందితుడిని ఎస్ఐ దుర్గా ప్రసాద్ అరెస్టు చేసి, కేవలం 17 రోజుల వ్యవధిలోనేఅభియోగ పత్రంను న్యాయ స్థానంలో దాఖలు చేసి, నిందితుడు జైలు నుండి విడుదల కాకుండానే, ప్రాసిక్యూషనుపూర్తయ్యే విధంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో భోగాపురం రూరల్ సిఐ జి. రామకృష్ణ, ఎస్ఐ ఐ.దుర్గా ప్రసాద్చర్యలు చేపట్టారన్నారు. విచారణలో నిందితుడు మైనపు హరీష్ పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరంస్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితుడికి 7సం.లు కఠిన కారాగారం, రూ.3,000/-లజరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.నిందితుడు గతంలో ఇదే తరహా నేరంకు 2023లో కూడా పాల్పడ్డారని, సదరు కేసు న్యాయస్థానంలో ఇంకనూ విచారణలో ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుడి నేర ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకొని, త్వరితగతిన ప్రాసిక్యూషనుపూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున స్పెషల్పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్ట ఖజానారావు వాదనలు వినిపించగా, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగఎస్ఐ ఐ.దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎన్.రామ నివాస్, సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులుసిహెచ్.రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు. పోక్సో కేసులో త్వరితగతిన నిందితులకి శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.