

జనం న్యూస్ 11 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం బాబామెట్ట ఖాదర్ వలీ బాబా సుగంధ మహోత్సవాలలో బొ బ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సోమవారం పాల్గొన్నారు. దర్లా దర్భార్ పీఠాధిపతి సజ్జదా నపీన్ మహమ్మద్ ఖాజా, మోహిద్దీన్ షరాఫ్ షా తాజ్, ఖాదరి బాబా, తదితరులు ఎమ్మెల్యే బేబినాయనకు ఘన స్వాగతం పలికారు. దర్గాలో చేసిన ప్రత్యేక ప్రార్ధనాలలో బేబినాయన పాల్గొన్నారు. ప్రజలను సుఖసంతోషాలతో చూడాలని, రైతులకు పాడి పంటలు పండాలని కోరుకున్నట్లు తెలిపారు.