జనం న్యూస్- మార్చి 5- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ మోడల్ హై స్కూల్ లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులను ఉద్దేశించి మహారాజుల సేవా సంఘం సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూవిద్యార్థుల చేతిలో దేశ భవిష్యత్తు ఉంది అని, విద్యార్థులు మంచి గొప్ప లక్ష్యాలు కలిగి ఉండాలి అని ఒక నిబద్ధత నియమం నిరంతరం లక్ష్యం వైపు మాత్రమే ఆలోచనలు సాగాలని ,అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకుంటారు అని మీరు ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు , విద్యనేర్పించిన గురువులకు మంచి పేరు తెచ్చినవారవుతారాని,సమాజానికి భవిష్యత్తులో మీరు కూడా మీ వంతు ఇతరులకు సహాయపడే గుణం మీలో రావాలని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమ లో మహారాజుల సేవా సంఘం సభ్యులు బద్రి, వీరబాబు, నకులరావు, పుల్లారావు,సతీష్,షాను,జ్యోతి,అనూష ,నాగరాజు , ప్రధానోపాధ్యాయులు శేషు, ఉపాధ్యాయబృందం విద్యార్థులు పాల్గొన్నారు.


