జనం న్యూస్ మార్చి 6, వికారాబాద్ జిల్లా
పరిగి మండలం లోని రాపోల్, కాళ్లపూర్ రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1200 వందల ఎకరాల భూమి కోల్పోతున్న కల్లాపూర్, రాపోల్ రైతులు కల్లాపూర్, రాపోల్ రైతులకు అండగా ఉంటాం అని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు, ఉన్నత అధికారుల దగ్గరకి వెళ్లి , న్యాయ పోరాటం చేస్తాం అని , రైతులు ఎవరు అధైర్య పడొద్దు అని, ప్రభుత్వంలో కోట్లడడానికి అయినా సిద్ధంగా ఉన్నాం అని, కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు.పేదల ఇల్లమీదికి బుల్లోజర్లు ,రైతుల భూములను దోచుకోవడం తప్ప ,, రైతులకు , ప్రజలకు మంచి చేద్దాం అనే, ఆలోచల లేదు అని , రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గిన బుద్ధి చెప్తారు అని, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. ఇ కార్యక్రమం లో రాపోల్, కళ్ళపూర్ రైతులు , మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అంతిగారి సురేందర్, మాజీ ఎంపిపి అరవింద్ రావ్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ హన్మంత్ రెడ్డి, బీఆరెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



