Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 11 కాట్రేనికోన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం అఖండఅన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీటీసీ అక్కల శ్రీధర్ తెలిపారు. శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.12.2.2025వ తేదీ బుధవారం ఏర్పాటు చేసే ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి యావన్మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు