Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 6 సెల్ 9550978955

ఈ ప్రాంతాలు పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతాలు కావడంతో పాటు ప్రీ-స్కూల్‌లు, ప్రాథమిక పాఠశాలలు, హైస్కూల్‌లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రతి రోజు వేలాది మంది చిన్నారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, వృద్ధులు నడుచుకుంటూ, సైకిళ్లపై, ద్విచక్ర వాహనాలపై, ఆటోల్లో ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారు అయితే వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో దాడి చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్నారులు స్కూల్‌కు వెళ్లడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా పద్మసాలి పేట, హైస్కూల్ రోడ్, గౌడపాలెం రోడ్, విజయ బ్యాంక్ సెంటర్ రోడ్ ప్రాంతాల్లో ప్రతిరోజూ కుక్కల అరుపులు, రోడ్లపై పరస్పర పోట్లాటలకు ప్రజల లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి ఇక హోటళ్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఆహార వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించకపోవడం వల్ల కుక్కలు హోటళ్ల ముందు గుంపులుగా చేరి రోడ్లపై సంచరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాహనదారులు అకస్మాత్తుగా కుక్కలు ఎదురుపడటంతో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ సమస్యను చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు అత్యవసరంగా పరిగణించాలి. వీధి కుక్కల నియంత్రణ, స్టెరిలైజేషన్ కార్యక్రమాలు వేగవంతం చేయాలి. హోటళ్ల వద్ద వ్యర్థాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రత, ముఖ్యంగా చిన్నారుల రక్షణ దృష్ట్యా తక్షణ చర్యలు అవసరం ప్రజల ప్రాణ భద్రతకే ప్రాధాన్యతనిస్తూ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు