Listen to this article

జనం న్యూస్ మార్చి 6 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి

హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన మన్మధ్ రావు నూతనంగా నిర్మించిన గృహంలో నిర్వహించిన గృహ ప్రవేశ వేడుకలు శుభకర వాతావరణంలో ఘనంగా జరిగాయి. రోడ్ నం: 12-13 లో జరిగిన ఈ కార్యక్రమానికి హనుమాన్ నగర్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొత్త ఇంటిలో సుఖశాంతులతో జీవించాలని మన్మధ్ రావు కుటుంబ సభ్యులకు ఆశీస్సులు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అతిథులకు ప్రసాదం, అల్పాహారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కమిటీ సభ్యులు, స్థానికులు, బంధుమిత్రులు పాల్గొని మన్మధ్ రావు కుటుంబానికి అభినందనలు తెలిపారు. కొత్త ఇంటిలో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.