Listen to this article

జనం న్యూస్ 11 ఫీబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వివిధ మండలాలు ఏర్పాటు కావాలని కోరుతూ. తమకు జరిగిన అన్యాయం గల ఆసక్తికర ఆలోచనకర ఆవేదన గల. ప్రసంగాలతో . వాల్మీకి భవనంలో. ప్రజలు నాయకులు దాదాపు 300 మంది పాల్గొని. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వక్తలు అఖిల పక్షం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభను విజయవంతం చేశారు. తమ అభిప్రాయాలను తమ యొక్క డిమాండ్లను తమ ప్రతిపాదనలు అఖిలపక్షం ముందు ఉంచారు . వక్తలు వెలిబుచ్చిన. అభిప్రాయాలకు అఖిలపక్ష కమిటీ ప్రతిపాదించిన పలు తీర్మానాలు జిల్లా కేంద్రంలో వాల్మీకి భవనములో ఈరోజు నూతన మండలాల ఏర్పాటు కొరకు చేసిన సమావేశంలో వక్తలు గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘ నాయకులు, నాయకులు విస్తృతంగా మాట్లాడిన తర్వాత ఆయా గ్రామాల నుండి వచ్చిన నూతన మండలాల ప్రతిపాదనలన కొరకు అందరిని కలుపుకొని మండలాలు ఏర్పాటు అయ్యేదాకా పోరాడుదామని వచ్చిన ప్రతిపాదనలను ఏకగ్రీవ తీర్మానం చేసింది. *ప్రజలు ప్రతిపాదించిన మండలాలు*మల్లకల్ మండలం నుండి ఎల్కూరు, బిజ్వారం గట్టు మండల నుండి బలిగేర, మాచర్ల మిట్టదొడ్డి, చాగదొనఐజ మండలం నుండి మేడికొండ, టిటి దొడ్డి ధరూర్ మండలం నుండి కేటి దొడ్డి, ఉప్పెరు, రేవులపల్లి గద్వాల మండలం నుండి పూడూరు, అనంతపురం కేటి దొడ్డి మండలం నుండి నందిన్నె గిరిజన.గిరిజన మండలంగా ఆలూరురెండవ తీర్మానం గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, మలకల్, బలిగెర, మాచర్లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు.గద్వాల అలంపూర్ నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలను పెంచాలని తీర్మానం గద్వాల జిల్లాలో మున్సిపాలిటీలలో కౌన్సిలర్ స్థానాలను పెంచాలని తీర్మానం. గద్వాల నియోజకవర్గంలో నూతన పంచాయతీలు పెంచడం. కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట రాములు. బల్గిర శివారెడ్డి. అచ్చన్న గౌడు. మోహన్ రావు. అతికుర్ రెహమాన్. సిపిఐ ఆంజనేయులు. ఇక్బాల్ పాషా అడ్వకేట్ & పాలమూరు అధ్యయన వేదిక. ప్రభాకర్ టి పి ఎఫ్.. ముని రెడ్డి ఉప్పేర్ .ఎమ్మార్పీఎస్ ఆంజనేయులు. వైన్డింగ్ రాములు. పచ్చర్ల శ్రీనివాసులు. వినోద్. బహుజన రాజ్య సమితి. సత్యారెడ్డి గోపాల్ రావు. టవర్ మక్బూల్. రఘునాథ్ రెడ్డి. ఎస్ ఆర్ హనుమంతు. వివిధ గ్రామాల ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు..తదుపరి కార్యచరణలో భాగంగా ఈ నెల 17వ తేదీన కలెక్టర్ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం సమర్పించుటకు వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని తీర్మానించారు