Listen to this article

బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రోజు బిచ్కుంద సర్కిల్ పరిధిలో బాన్స్‌వాడ డీఎస్పీ ఆధ్వర్యంలో, బిచ్కుంద సీఐ, బిచ్కుంద ఎస్సై గుండెల రాజు (SHO) సారాధ్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో “Arrive Alive Program” నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద సర్కిల్ పరిధిలోని సుమారు 120 మంది ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ వినియోగం, అతివేగం నివారణ, మద్యం సేవించి వాహనం నడపకూడదని,రోడ్డు ప్రమాదాలను నివారించే అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ బోధన్ వారు బ్యాన, ఇతర సామగ్రిని అందించి సహకరించగా వారి సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.