సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,సీసీ అనసూయ,
జనం న్యూస్,మార్చ్ 06,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద మహిళా భావన నిర్మాణానికి శుక్రవారం సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,సీసీ అనసూయ,గ్రామ నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో స్వయం సహాయక సంఘాల (ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ) బలోపేతం కోసం ప్రభుత్వం కొత్తగా ‘ఇందిరా మహిళా శక్తి భవనాల’ను నిర్మిస్తోంది.200 గజాల స్థలంలో సుమారు ₹10 లక్షల వ్యయంతో నిర్మించే ఈ భవనాలు మహిళా సమావేశాలు, శిక్షణ,ఉత్పత్తుల ప్రదర్శనకు ఉపయోగపడతాయి అన్నారు.మహిళా భవన్ నిర్మాణాల
ప్రధాన ఉద్దేశ్యం: మహిళా సంఘాల సమావేశాలు,శిక్షణ జీవనోపాధి పెంపొందించడం. ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద నిధులతో సౌకర్యాలతో ప్రతి భవనంలో సమావేశ మందిరం,శిక్షణ కేంద్రాలు ఉంటాయి. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా మారేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్ ఏఈ వంశి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిసెల చిన్న మల్లారెడ్డి,ఉప సర్పంచ్ భగవాన్ సమీర్, కోటగిరి మనోహర్, డాక్టర్ హమీద్,తట్టి వీరేశం,రాజు,రుస్తుం సమీర్,వివో లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.


