

జనం న్యూస్ 11 ఫీబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగానే తగ్గించి ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి తక్షణమే రీ సర్వే చేయాలి 22 లక్షల మందిని జనాభా లెక్కలలో లేకుండా చూపడం దారుణం బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎట్లా పెరుగుతుంది ?BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అదేశం మేరకు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ..తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2014లో జరిపించిన SKS ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 51 % అని 1.85 కోట్లు నిర్ధారణ కాగా, అదిప్పుడు 46% 1.64 కోట్లు శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం, 5% తగ్గించి చూపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను అసెంబ్లీలో ఆమోదించడం, చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయాలన్న చిత్తశుద్ధి అధికార కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా లోపించిందని మండిపడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అమలు చేసే ఉద్దేశం కాని, బీసీలకు సబ్ ప్లాన్ ను అమలు చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు.ఈ అశాస్త్రీయ కులగణన సర్వేతో తేటతెల్లమయ్యిందన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పాలకులకు చాలా చులకన భావం నెలకొందని చెప్పడానికి మంత్రిమండలి కూర్పే ఒక ప్రబల నిదర్శనమని అన్నారు. బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు,యాదవ్, ముదిరాజ్, కురువలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం, రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు.కులగణన సర్వేలో చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరిదిద్దాలని,ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలని,కేబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.42% రిజర్వేషన్లు ఇస్తామన్న మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలిదీనిపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాము. కానీ బిల్లు తేలేదు సొల్లు మాత్రం చెప్పారుబీఆర్ఎస్ మాత్రమే 50 శాతానికి పైగానే బీసీలకు పార్టీ పరంగా అసెంబ్లీ పార్లమెంటు స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది అత్యధిక సీట్లు కేటాయించింది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చిందిశాసనసభ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. కేవలం 19 సీట్లు మాత్రమే ఇచ్చారు అందులో పాతబస్తీలో ఐదు సీట్లు ఉన్నాయి బీఆర్ఎస్ మాత్రం చెప్పకుండానే బలహీనవర్గాలకు 34 సీట్లు ఇచ్చింది. మాకు ఎవరి సర్టిఫికేట్లు అవసరం లేదు కేటీఆర్ ఆదేశాల మేరకు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, జిల్లా కేంద్రాల వారీగా భావజాలవ్యాప్తిని ప్రారంభిస్తాం. ప్రజలను జాగృతం చేస్తాం అని అన్నారు.అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు,వాటా కోసం నిరంతరం పోరాడుతుందని *బీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి మాధవ్, ఓంకార్, సందేశ్, పవన్, మహేష్, చక్రవర్తి, బన్ను, జానూ సుందర్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.