Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 6 సెల్ 9550978955

గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, ఆటోలు మరియు ఇతర చిన్న ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను నడుపుతున్నారని తెలిపారు. ఈ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూ, కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు తీవ్రంగా గాయపడుతూ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం చెల్లించవని, దాంతో కుటుంబాలు సంపాదించే వ్యక్తిని కోల్పోయి మరింత కష్టాల్లో పడుతున్నాయని పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రతి గ్రామంలో సచివాలయాలు, వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామపంచాయతీ సెక్రటరీలు ఉన్న నేపథ్యంలో వారు వాహన యజమానులతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో లైసెన్స్ లేకుండా లేదా ఇన్సూరెన్స్ లేకుండా నడుస్తున్న వాహనాలను గుర్తించి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడంతో పాటు ఇన్సూరెన్స్ చేయించాల్సిన అవసరం ఉందని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ వాహనాలు నడపకుండా కఠిన నిబంధనలు అమలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇలా చేస్తే ప్రమాదాలు తగ్గడమే కాకుండా, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుందని తెలిపారు