Listen to this article


జనం న్యూస్ మార్చి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల

కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కళ్యాణలక్ష్మి పథకం కింద నలుగురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ మల్లయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.