Listen to this article

జనం న్యూస్ ;7 మార్చ్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్;

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజు స్థానిక శ్రీవాణి స్కూల్ భారత్ నగర్ లొ ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాళ్ల కోసం ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు.ఆటలో గెలుపొందిన ఉపాధ్యాయురాళ్లకు డైరెక్టర్ సి.హెచ్. సత్యం బహుమతులు అందజేసి అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ, మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగడం సమాజానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయురాలు కేక్ కట్ చేసి పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు