Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955

పసుమర్రు ప్రజల తాగునీటి అవసరాలకు బొప్పూడి లిఫ్ట్ నుంచి స్థానిక చెరువును నీటితో నింపండి.
ఆటోనగర్ కార్మికులు లేవనెత్తిన సమస్యలు రోజుల వ్యవధిలో పరిష్కారం కావాలి.సంకురాత్రి పాడు గ్రామాభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి.ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మాజీమంత్రి ప్రత్తిపాటి.పసుమర్రు ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం, వేసవిలో ఎదురయ్యే నీటిఎద్దడి దృష్ట్యా ఇప్పుడే గ్రామంలోని చెరువును నీటితో నింపాలని, బొప్పూడి లిఫ్ట్ నుంచి నీటిని తరలించేలా చూడాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులకు సూచించారు. శనివారం ఆయన తన నివాసంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పసుమర్రు గ్రామస్తులు ప్రత్తిపాటిని కలిసి గ్రామాభివృద్ధి, ఇతర సమస్యలు తెలియచేస్తూ వినతిపత్రం అందించారు. వారి వినతిని పరిశీలించిన ప్రత్తిపాటి.. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా గ్రామంలోని చెరువును వెంటనే నీటితో నింపాలని పంచాయతీ, ఆర్ డబ్ల్యూఎస్ సిబ్బందికి సూచించారు. సీఎస్సార్ నిధులతో ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఆటోనగర్ సమస్యల్ని రోజుల వ్యవధిలో పరిష్కరించండి
ఆటోనగర్ కార్మికులకు స్థానికంగా కేటాయించిన ప్లాట్లలో కొలతలు తేడాలున్నాయని, హద్దులు సరిగా లేనందున సమస్యలు వస్తున్నాయని, రెండో ఫేజ్ లో రోడ్లు , కాలువలు నిర్మించాల్సి ఉందని, నీటి అవసరాలకోసం బోర్లు వేయించాలని, ఆటోనగర్ ప్రవేశంలో ప్రత్యేక స్వాగతద్వారం (అర్చీ) నిర్మించాలని స్థానిక కార్మికులు ప్రత్తిపాటిని కోరారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలియచేస్తూ వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన ప్రత్తిపాటి ప్లాట్ల హద్దుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని మండల సర్వేయర్ ప్రసాద్ కు సూచించారు, ఆటోనగర్ లో బోర్లు వేయాలని ఆసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల్ని కోరాకు. ప్రత్తిపాటి విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే బోర్లు వేస్తామని చెప్పారు. ఆర్చీ నిర్మాణం.. రోడ్లు, కాలువల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి, స్థానిక మున్సిపాలిటీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావులకు సూచించారు. టోనగర్ కార్మికులు చెప్పిన సమస్యలన్నీ రోజుల వ్యవధిలోనే పరిష్కారం కావాలన్నారు.గతేడాది తలెత్తిన తాగునీటి సమస్యలు ఈ ఏడాది పునరావృతం కాకూడదు పట్టణ ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించిన ప్రత్తిపాటి.. చిన్నచిన్న సమస్యలను యంత్రాంగం అశ్రద్ధ చేయడం తగదని, మంచినీరు, రోడ్లు, పారిశుధ్య నిర్వహణా లోపాలు వంటి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టంచేశారు. మున్సిపల్ సిబ్బంది పట్టణ ప్రజల తాగునీటి సమస్యపై వెంటనే దృష్టి సారించాలని, గతేడాది తలెత్తిన నీటిసరఫరాలో ఏర్పడిన లోపాలు మరలా ఈ ఏడాది ఎక్కడా పునరావృతం కాకూడదని ప్రత్తిపాటి ఆదేశించారు.నాదెండ్ల మండలం సంకురాత్రి పాడు గ్రామంలో సీసీరోడ్లు, ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, శ్మశానికి వెళ్లే దారిలో వాగుపైన రూ.22 లక్షలతో నిర్మించే బ్రిడ్డి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ప్రత్తిపాటికి వినతిపత్రం అందించారు. గ్రామస్తులు చెప్పిన అభివృద్ధి అంశాలపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.