Listen to this article

జనం న్యూస్ మార్చేయడం అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ఈనెల ఎనిమిదో తేదీన దేవాలయ పున: ప్రతిష్ట, రాజగోపురం ప్రతిష్ట సందర్భంగా దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్సీ వద్ద నాగ జగదీశ్వరరావు శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ ను దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను, కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ స్వాగతం పలికి బాలయాలంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాల స్వీకరించిన అనంతరం నాగ జగదీష్ ను పరివట్టం చుట్టి పూలమాలవేసి అర్చక స్వాములు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అలాగే కాండ్రేగుల సత్యనారాయణకు నాగ శీను కండువా వేసి సత్కరించారు.