Listen to this article

జనం న్యూస్-మార్చి 7- నాగార్జునసాగర్ టౌన్-

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రెండవ రోజు నందికొండ మున్సిపాలిటీ ఒకటి మరియు 12 వార్డులలో చెట్ల పొదలు తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నందికొండ పురపాలక సంఘం కమిషనర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులచే మాస్ గార్బేజ్ క్లీనింగ్ చేయించారు. ఒకటవ వార్డులో జరిగిన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ యాడికి నాగమల్లేశ్వరి పర్యవేక్షణలో చెత్త తొలగింపు కార్యక్రమం నిర్వహించగా, 12వ వార్డులో వార్డు కౌన్సిలర్ నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస సుమన్ పర్యవేక్షణలో చెత్త తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమన్, రాజగోపాల్ రెడ్డి, రమావత్ మంగత నాయక్, ఉంగరాల శ్రీను, నరసింహారెడ్డి, మరియు మున్సిపాలిటీ సిబ్బంది వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.