Listen to this article

, మార్చి 07 (జనం న్యూస్): నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మి పథకం కింద గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారికి చెక్కును అందజేశారు. స్థానిక సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ మూడ్ దయానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కరీం, బి. శ్రీనివాస్ కలిసి లబ్ధిదారికి చెక్కును అందించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పొకల్కర్ గణేష్, సారంగి ముత్తేమ్మ, లక్ష్మి, మౌనిక, నీలిమ, జిపివో సంపత్, పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు.