Listen to this article

*8 లక్షలు ఎల్ఓసి మంజూరు చేసి, అండగా నిలచిన ఎమ్మెల్యే బుడ్డా.

*ఎమ్మెల్యే బుడ్డా కి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు….

జనం న్యూస్ 7 మార్చి 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండలం లోని సోమయాజులపల్లె గ్రామానికి చెందిన మునిగ సుకన్య అనే యువతిని ” సెవెరే అప్లాస్టిక్ అనేమియా ” అనే ప్రాణాంతక వ్యాధి తన జీవితాన్ని ప్రశ్నార్ధకం చేసింది. ఆర్థిక స్థోమత లేక, తమ బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండగా.. గ్రామ నాయకులు ఓంకారం చైర్మన్ చెన్నారెడ్డి,ఈశ్వర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సుకన్య కు మెరుగైన చికిత్స అందించేందుకు పూనుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సుకన్య దీన స్థితిని తీసుకెళ్లిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా హైదరాబాద్ లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో చికిత్స కోసం రూ. 8లక్షల ఎల్ ఓ సి మంజూరు చేసి అండగా నిలిచారు. ఈమేరకు నేడు మంజూరు పత్రాన్ని గ్రామ నాయకుల ద్వారా కుటుంబ సభ్యులకు అందజేశారు.తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడు కి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కి సుకన్య కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అహర్నిశలు చేసిన కృషి పట్ల గ్రామస్థులు సైతం హర్షం వ్యక్తం చేశారు.